తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ చలిపులి పంజా.. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు - తెలంగాణ వార్తలు

Low temperatures in Telangana : రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నాయి. ఉదయం పూట ఇళ్లల్లో నుంచి బయటకు వస్తే ఒళ్లు జలధరించేలా ఇగం ఇంతకింతకు తన జోరుని పెంచుతోంది.

Low temperatures in Telangana, telangana weather report
మళ్లీ చలిపులి పంజా

By

Published : Jan 29, 2022, 11:28 AM IST

మళ్లీ చలిపులి పంజా

Low temperatures in Telangana : రాష్ట్రంలో ఇటీవల చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని చోట్ల పొగ మంచు దట్టంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8గంటల వరకు కూడా సూర్యుడు కనిపించడం లేదు. చలి తీవ్రతతో రాత్రి, తెల్లవారుజామున విధులు నిర్వర్తించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చలితీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతికుమార్ సంగారెడ్డి నుంచి అందిస్తారు.

చలి కౌగిలి..

ఇప్పటికే వాతావరణంలోని మార్పుల వల్ల పలు జిల్లాల్లో పలువురు చలి ప్రభావంతో జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అవస్థల్ని ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ రోడ్లు కనిపించని విధంగా మంచు పేరుకుపోతుండటంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఈనెల 26వ తేదీన జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 11.7 డిగ్రీలుగా ఉండగా.. గురువారం రాత్రికల్లా నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీలోపునకు ఉష్ణోగ్రతల స్థాయి పడిపోయింది. జనవరి మొదటి వారం నుంచి చలి తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి వచ్చింది. ఇటీవల నాలుగు రోజులుగా మాత్రం క్రమంగా ఇగం పెరిగింది. మరికొన్ని రోజులు ఇలాంటి విపరీత చలిని ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా బయటకు వచ్చే వారు మాత్రం విధిగా తగు జాగ్రత్తల్ని రక్షణ పరంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా సహా ఇతర ఇబ్బందులు పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు.

ఇదీ చదవండి: New Worm at Elukurthy Haveli: పుడమిరంగులో పురుగు.. మీరెప్పుడైనా చూశారా..!

ABOUT THE AUTHOR

...view details