ముత్తంగి వద్ద లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు - driver
సంగారెడ్డి జిల్లా ముత్తంగి బాహ్య వలయ రహదారిపై ప్రమాదం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్తగా ఉండటం వల్ల కోళ్ల దానా లోడు తీసుకెళుతున్న లారీ బోల్తా కొట్టింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ముత్తంగి వద్ద లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ముత్తంగి బాహ్యవలయ రహదారిపై ప్రమాదం జరిగింది. కోళ్ల దానా లోడుతో కూడలి గుండా పాండిచ్చేరికి వెళ్లేందుకు బాహ్య వలయ రహదారిపైకి ఎక్కుతుండగా.. డ్రైవర్ ఏమరపాటుగా ఉండటం వల్ల రహదారి భద్రతా వలయాన్ని ఢీకొట్టింది. ఎక్కువ లోడు ఉండటం వల్ల లారీ బోల్తా కొట్టింది. రహదారి భద్రతా వలయం దెబ్బతినగా.. లారీ ముందు భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.