సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ పుష్పలత, జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ శ్రీదేవి కేసులను పరిష్కరించారు. కేసుల విషయంలో కక్షిదారులు పట్టింపులు, పంతాలకు పోకుండా రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. పరస్పరం అంగీకారానికి వస్తే సత్వర న్యాయ సేవలు అందుతాయని జడ్జిలు సూచించారు.
ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా.. కోర్టు కల్పిస్తున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని త్వరితగతిన న్యాయ సహాయం పొందాలని ప్రజలకు సూచించారు. లోక్ అదాలత్లో బ్యాంకు రుణాలు, పోలీసు, ఎక్సైజ్ శాఖ కేసులు పరిష్కరించి పలువురికి ఈ సందర్భంగా జరిమానాలు వేశారు.
'రాజీ మార్గమే.. రాజ మార్గం' - లోక్ అదాలత్ తాజా వార్త
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో నిర్వహించారు. కేసుల విషయంలో కక్షిదారులు పట్టింపులకు పోకుండా రాజీపడడం ద్వారా సత్వర న్యాయ సేవలు అందుతాయని జడ్జిలు సూచించారు.
'రాజీ మార్గమే.. రాజ మార్గం'
ఇదీ చూడండి: 'మూసీ ప్రక్షాళన' కోసం అనంతగిరికి భాజపా ర్యాలీ