తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తి పంటపై మిడతల ప్రభావం అంతగా ఉండదు... - sangareddy latest news

సంగారెడ్డి జిల్లాలో మిడతలు దాడి చేసిన పత్తి పంటను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. పత్తిపంటపై మిడతల ప్రభావం అంతగా ఉండదని వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మందులు పిచికారీ చేస్తే చాలని పేర్కొన్నారు.

locusts attack
locusts attack

By

Published : Jul 29, 2020, 9:13 PM IST

పత్తి పంటపై మిడతల దండు దాడి ప్రభావం అంతగా ఉండదని ఏరువాక శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచించిన రసాయనాలను పిచికారీ చేసి నివారించవచ్చని వివరించారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేట ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ, మెదక్ జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి బైరాన్ దిబ్బ గ్రామానికి చెందిన రైతు బాలయ్య పత్తి పంటను పరిశీలించారు. ఈ మిడతలతో పత్తి పంటలపై అంత ప్రభావం ఉండదన్నారు.

ఇవి పొలం గట్లపై గుడ్లు పెడతాయని ఆ గట్టును వ్యవసాయ అధికారులు సూచించిన మందుతో పిచికారీ చేసి శుభ్రం చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పంటపై వేప కషాయం పిచికారీ చేయాలని సూచించారు. రైతులు అధైర్యపడొద్దని... ఈ మిడతల ప్రభావం అంతగా ఉండదన్నారు.

ఇది చదవండి:ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక

ABOUT THE AUTHOR

...view details