ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల లాక్డౌన్ విస్తృతమౌతోంది. కరోనా కేసులు తగ్గకపోవడం వల్ల పూర్తి స్థాయి లాక్డౌన్ పాటిస్తున్నారు. వ్యాపార వర్గాలు, పురపాలక సంఘాలు అందుకు మద్దతు తెలిపాయి. మరికొన్ని ప్రాంతాల్లో నిర్ణీత వ్యవధి పెట్టి దుకాణాలు తెరుస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు - Strict enforcement lockdown in Sangareddy district
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి రోజురోజూకీ పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో బాధితుల సంఖ్య 1500కు చేరువలో ఉంది. కరోనాను అరికట్టేందుకు కొన్ని పట్టణాలు, గ్రామాల్లో పాలక మండళ్లు కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ అమలు తీరుపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
![ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు Lockdowns are being strictly enforced in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8392369-59-8392369-1597231135277.jpg)
ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు
గ్రామాల్లో కూడా కేసుల ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల గ్రామాల్లో ప్రజలు పట్టణాల బాట పడుతున్నాయి. పలు గ్రామాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించారు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలోని పీహెచ్‌సీల్లో కరోనా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రి హరీశ్‌రావు సైతం కరోనా బారిన పడిన వారికి తన సొంత నిధులతో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి కిట్లు అందిస్తున్నారు.
ఇదీ చూడండి :కాంగ్రెస్ నేతలు భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబులను అడ్డుకున్న పోలీసులు