సంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా బయటకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని.. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డీఎస్పీ బాలాజీ సూచించారు.
సంగారెడ్డిలో పకడ్బందీగా లాక్డౌన్ - సంగారెడ్డి జిల్లా డీఎస్పీ బాలాజీ వార్తలు
సంగారెడ్డి జిల్లాలో డీఎస్పీ బాలాజీ లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు. జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోందని... ప్రజలందరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.
![సంగారెడ్డిలో పకడ్బందీగా లాక్డౌన్ lockdown strictly implementing in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:57:43:1621924063-11888990-lock.jpg)
సంగారెడ్డిలో పకడ్బందీగా లాక్డౌన్
ప్రజలందరూ కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే.. వాహనాలు సీజ్ చేసి వాహనదారులపై కేసులు పెడతామని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు.
ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా