సంగారెడ్డి నియోజకవర్గంలో ఐదోరోజు లాక్డౌన్ పటిష్ఠ భద్రత నడుమ కొనసాగుతోంది. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తూ అనవసరంగా బయటకు వచ్చే వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
లాక్డౌన్@5.. ఆంక్షలు విధించినా రోడ్లపై జనం - సంగారెడ్డి నియోజకవర్గంలో ఐదోరోజు లాక్డౌన్
సంగారెడ్డి నియోజకవర్గంలో ఐదోరోజు లాక్డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు పహారా కాస్తూ అనవసరంగా బయటకు వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంగారెడ్డిలో ఐదోరోజు లాక్డౌన్
కొందరు తాము ఫలానా తరఫున అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొందరు వేర్వేరు సాకులతో బయటకు వస్తున్నారు. కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండి లాక్డౌన్ మినహాయింపు సమయం మాత్రమే వాడుకోవాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు