సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో లాక్డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నాలుగో రోజుకి చేరుకుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో నిత్యావసరాలకు బయటకు వచ్చిన జనం.. సమయం గడిచినా ఇంకా ఒక గంట ఎక్కువగానే తీసుకుంటున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగోరోజు పటిష్ఠంగా లాక్డౌన్ - సంగారెడ్డిలో లాక్డౌన్
సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగో రోజు లాక్డౌన్ ప్రశాంతంగా అమలవుతోంది. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు బయటకు వచ్చి నిత్యావసర వస్తువుల వినియోగంతో పాటు పనులు పూర్తి చేసుకుంటున్నారు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరారు.
సంగారెడ్డిలో లాక్డౌన్
తాము ఉన్నామనే భయంతో కాకుండా.. కరోనా కట్టడి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సహకరించాలని పోలీసులు కోరారు. ప్రజలు ఇంట్లో కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ వల్ల తగ్గుతున్న కరోనా కేసులు: వైద్యులు