సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో లాక్డౌన్ 8వ రోజు అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. ఆటోల్లో జనం మినహాయింపు సమయం దాటినా ప్రయాణిస్తున్నారు. పోలీసులు రౌండ్లు వేసే వరకు వ్యాపారస్తులు షాపులను మూయడం లేదు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: డీఎస్పీ - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
సంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. జనాలకు కరోనా భయం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. అకారణంగా బయటకు వస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
lockdown
అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సీజ్ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని డీఎస్పీ సూచించారు. అకారణంగా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి:దృష్టి మళ్లించడమే కేంద్రం విధానం: రాహుల్