కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి లాక్‌డౌన్ విధించి... ఉదయం నాలుగు గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలో సంగారెడ్డి నియోజకవర్గంలో వ్యాపార సముదాయాల వద్ద రద్దీ మొదలైంది. ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారాయి. పరిమిత సమయంలో నడుపుతుండడంతో ఎక్కవశాతం బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి.
నేటి నుంచి లాక్‌డౌన్... కిక్కిరిసిన వ్యాపార సముదాయాలు - సంగారెడ్డి జిల్లా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి లాక్‌డౌన్ అమలుకానుంది. నిత్యావసర సరుకులు, ఇతర అవసరాలకు ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 వరకు వెసులుబాటు ఇచ్చింది. నాలుగు గంటలే సమయం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల మార్కెట్లు, కిరాణ దుకాణాలు, పెట్రోలు బంకుల వద్ద రద్దీ నెలకొంది.
నేటి నుంచి లాక్‌డౌన్... కిక్కిరిసిన వ్యాపార సముదాయాలు
కొవిడ్ విజృంభిస్తున్నా కూడా కొందరు వ్యాపారులు లెక్కచేయకుండా.. మాస్క్ ధరించకుండా వ్యాపారాలు చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా లాభాలే చాలు అనే రీతిలో వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్