సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లాక్డౌన్ పటిష్ఠంగా కొనసాగుతోంది. కూడళ్లలో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
అనవసరంగా బయటకు వస్తే చర్యలు తప్పవు: ఎస్పీ చంద్రశేఖర్ - సంగారెడ్డిలో లాక్డౌన్ వార్తలు
సంగారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు.
సంగారెడ్డిలో పటిష్ఠంగా లాక్డౌన్
అత్యవసరం అయితేనే బయటకి రావాలని ఎస్పీ సూచించారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలోనూ నిర్ణీత దూరం పాటించి, సరైన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని పేర్కొన్నారు. అనవసరంగా బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ