విజయవంతంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ - liquor shops allotment
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులకు మద్యం దుకాణాలను కేటాయించారు.
![విజయవంతంగా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4792299-141-4792299-1571397424248.jpg)
సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపికైన లబ్ధిదారులకు కేటాయించారు కలెక్టర్ హనుమంతరావు. జిల్లావ్యాప్తంగా మొత్తం 85 మద్యం దుకాణాలకు గానూ 1367 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాటరీ పద్దతిలో 83 దుకాణాలకు 83 మంది అభ్యర్థులను కేటాయించారు. మిగిలిన మరో 2 దుకాణాలకు 4 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున వాటిని నిలిపివేశామని... తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు వేచిచూస్తామని తెలిపారు. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా నిర్వహించిన అబ్కారీ శాఖ అధికారులను కలెక్టర్ హనుమంతరావు అభినందించారు.