సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో చిరుతపులి సంచరిస్తోంది. కల్హేర్ మండలం కృష్ణాపూర్, మనస్పూర్ గ్రామాల శివారులో సోమవారం రాతికుచ్చపై కూర్చున్న చిరుతపులిని.. మేకల కాపరులు గమనించారు. ఆ పులిని దూరం నుంచే ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద పనులు చేస్తున్న రైతులు, కూలీలు గ్రామాల వైపు పరుగులు తీశారు.
LEOPARD WANDERING: కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత సంచారం
సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. కల్హేర్ మండలం కృష్ణాపూర్, మనస్ పూర్ గ్రామాల సమీపంలో చిరుత సంచరిస్తుండగా స్థానికులు తీసిన ఫొటోలు చూసి.. ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు.
గతంలో కూడా ఇక్కడ చిరుత పులి సంచరిస్తోందని ప్రచారం జరిగింది. అయితే అది ఎవరికీ కనిపించకపోవడంతో ఇన్నాళ్లు ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. అనుకోకుండా సోమవారం చిరుతపులి దర్శనమివ్వడంతో పరిసర ప్రాంతాల వారు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా పశువుల కాపరులు, రైతులు, రైతు కూలీలు, ద్విచక్ర వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:EAMCET: రేపటి నుంచే ఎంసెట్.. పరీక్షా కేంద్రం పేరు క్షుణ్నంగా చూసుకున్నారా?