తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక రూపాయికే వైకుంఠ రథం.. అంత్యక్రియలకు సాయం - sadasivpet municipality

ఓ వ్యక్తి మరణం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతుంది. పేద కుటుంబాల్లో.... అయినవారిని పోగొట్టుకున్న బాధలో ఉన్నవారికి... అంత్యక్రియల ఖర్చులు మరింత భారంగా మారతాయి. అలాంటి వారికి అండగా నిలుస్తోంది సదాశివపేట మున్సిపాలిటీ. రూపాయికే వైకుంఠరథం సేవలు అందిస్తూ కష్టకాలంలో తోడుగా నిలుస్తోంది.

last journey vehicle for on rupee at sadasivpet municipality in sangareddy district
ఒక రూపాయికే వైకుంఠ రథం

By

Published : Mar 22, 2021, 10:34 AM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక రూపాయికే వైకుంఠ రథం సౌకర్యం కల్పిస్తున్నారు. తమలో ఒకరిని కోల్పోయి బాధలో ఉన్న వారివద్ద డబ్బులు వసూలు చేయడం సరికాదనే ఆలోచనతో కౌన్సిలర్లు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒక్క రూపాయితో టోకెన్‌ బుక్‌ చేసుకుంటే చాలు వారికి సేవలు అందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. పట్టణవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎవరు ముందు బుక్‌ చేసుకుంటే వారికి వైకుంఠ రథ సేవలు అందిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. త్వరలోనే మరిన్ని వాహనాల కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం సంతృప్తినిస్తోందని కమిషనర్‌ పేర్కొన్నారు. మున్ముందు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటూ... మున్సిపాలిటీ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని కౌన్సిలర్లు, అధికారులు చెబుతున్నారు.

ఒక రూపాయికే వైకుంఠ రథం.. అంత్యక్రియలకు సాయం

ABOUT THE AUTHOR

...view details