తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిర్యాదు: మా పొలాన్ని కబ్జాచేశారు... న్యాయం చేయండి - అన్నారంలో భూమి కబ్జా తాజా వార్త

అన్నారం గ్రామంలోని తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓకుటుంబ సభ్యులు సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

land kabza at annaram village in sangareddy
ఫిర్యాదు: మా పొలాన్ని కబ్జాచేశారు... న్యాయం చెయ్యండి

By

Published : Oct 29, 2020, 2:06 PM IST

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని సర్వే నెం. 261లో ఉన్న భూమిలోని 40 ఎకరాలను తమ తండ్రి కొన్నారని బాధితులు సంజీవరెడ్డి, లత తెలిపారు. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు దానిపై కన్నేసి అక్రమంగా కబ్జా చేసి టిప్పర్లతో దున్నుతున్నారని ఆరోపించారు. పొలంలో ఉన్న చెట్లను నరికేసి... కంచెపై కబ్జాదారుల పేర్లు రాసుకున్నారని ఆవేదన వక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ భూమిలో తాము పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. ప్రభుత్వం తమకు పాసు పుస్తకాలు కూడా ఇచ్చిందన్నారు. న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details