తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధోల్​లో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - samme

ఆరు నెలలుగా జీతాలు చెల్లిచడం లేదని పారిశుద్ధ్య కార్మికులకు సమ్మెకు దిగారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికుల ధర్నా

By

Published : Apr 23, 2019, 4:48 PM IST

సంగారెడ్డి జిల్లా ఆంథోల్- జోగిపేట పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించట్లేదు. దీనిపై నిరసనగా వారు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విషయమై లేబర్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని సీఐటీయూ జిల్లా నాయకుడు మొగిలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్మికుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details