ఆర్టీసీ కార్మికులు ఇన్ని రోజులు ధైర్యంగా పోరాటం చేయడం గొప్ప విషయమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నా సమ్మెలో పాల్గొని.. తన సంపూర్ణ మద్దతు తెలిపారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారని.. అంతిమ విజయం కార్మికులదేనని ఉద్గాటించారు. యాజమాన్యం చర్చల పేరుతో కార్మిక సంఘాల నాయకులను యుద్ధఖైదీలతో చర్చలు జరిపినట్లు జరిపి.. అమర్యాదగా ప్రవర్తించారన్నారు. కార్మికులకు తాము అండగా ఉంటామని.. భవిష్యత్తులో వారికి ఎలాంటి సహకరమైనా అందిస్తామన్నారు. రేపు సరూర్ నగర్లో ఆర్టీసీ కార్మికులు నిర్వహించే సకల జనుల సమరభేరి కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున హాజరై... మద్దతు తెలపాలని కోరారు.
'కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు' - KODANDARAM SUPPORT TSRTC STRIKE
రేపు హైదరాబాద్ సరూర్నగర్లో జరిగే సకల జనుల సమరభేరికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.
!['కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4902999-378-4902999-1572366091249.jpg)
'కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు'
'కార్మికులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు'