సంగారెడ్డి జిల్లాలోని శివాలయాల్లో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దైవ దర్శనానికి తరలి వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిలోని శ్రీకేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. దీపాలు వెలిగిస్తూ తమ జీవితాలు వెలుగు బాటలో నడవాలని భక్తులు కోరుకుంటున్నారు.
శివాలయాల్లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక దీపాలతో దేవస్థానాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు.
శివాలయాల్లో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
ఆలయానికి మూడు శతాబ్దాల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. శివరాత్రి, కార్తిక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. స్వామి వారు స్వయంభూలింగంగా విరాజిల్లుతున్నారన్నారు.
ఇదీ చదవండి:స్వర్ణదేవాలయంలో సిక్కులు ప్రత్యేక పూజలు