కార్తిక మాసం ప్రారంభం తొలి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఉమామహేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు.
ఉమా మహేశ్వర ఆలయంలో కార్తిక పూజలు - కార్తిక మాసం 2020
కార్తిక మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఉమా మహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
![ఉమా మహేశ్వర ఆలయంలో కార్తిక పూజలు karthika masam pujalu 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9555473-77-9555473-1605497443660.jpg)
పటాన్ చెరు ఉమా మహేశ్వర ఆలయంలో కార్తిక పూజలు
కార్తిక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అర్చకులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:కల్యాణ కాంతుల కార్తికం... పెళ్లిళ్లకు ఇదే శుభ ముహూర్తం