సంగారెడ్డిలో విజయ్ దివస్ ర్యాలీ - kargil vijay diwas ralley at sangareddy district
కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాకేంద్రంలో మాజీ సైనిక ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.

kargil vijay diwas ralley at sangareddy district
సంగారెడ్డిలో విజయ్ దివస్ ర్యాలీ
సంగారెడ్డిలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ రక్షణకై సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న కృషికి మనం ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. 20 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో తెలంగాణకు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారని, వారి కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా సంక్షేమాధికారి శ్రీనేశ్ తెలిపారు.
- ఇదీ చూడండి : 'వాజ్పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'