తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఓరైతు మృతి - కంగ్టి మండలం దామర్ గిద్ద గ్రామంలో విద్యుదాఘాతం

విద్యుదాఘాతం వల్ల ఓ రైతు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కంగ్టి మండలం దామర్ గిద్ద గ్రామంలో చెరకు తోట రక్షణ కోసం విద్యుత్ కంచె వేశారు. ఈ విషయం తెలియక సాయిలు అటుగా వెళ్తూ విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

kangti-mandal-of-sangareddy-district-farmer-killed-by-power
'విద్యుదాఘాతంతో ఓరైతు మృతి'

By

Published : Jun 2, 2020, 11:03 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామర్ గిద్ద గ్రామంలో విద్యుదాఘాతం వల్ల ఓ రైతు మృతి చెందాడు. చెరకు తోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగలడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

నాగేందర్ అనే రైతు చెరకు తోట రక్షణ కోసం విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. అది తెలియక బాన్సువాడ గ్రామానికి చెందిన సాయిలు అటుగా వెళ్తూ విద్యుత్ షాక్​కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details