తెలంగాణ

telangana

ETV Bharat / state

వెలుగులోకి నయా దందా... ఇదో కొత్త పెళ్లిగోల - కల్యాణలక్ష్మిలో అక్రమాలు

పేదింటి ఆడపిల్లల పెళ్లికి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి కల్యాణ లక్ష్మి పథకంలో నిధులు కాజేసేందుకు పన్నాగాన్ని పన్నారు. వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటకటాల పాలు చేశారు.

వెలుగులోకి కల్యాణలక్ష్మిలో అక్రమాలు

By

Published : Nov 9, 2019, 10:00 AM IST

Updated : Nov 9, 2019, 11:07 AM IST

వెలుగులోకి కల్యాణలక్ష్మిలో అక్రమాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ మండలం కొండాపూర్​కు చెందిన దేవీసింగ్​ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అక్రమ డబ్బు సంపాదించేందుకు తుర్కపల్లికి చెందిన నెహ్రూతో జత కలిసి నకిలీ పత్రాలు, నకిలీ ఆధార్​ కార్డులు సృష్టించారు. వాటి ఆధారంగా ఆదాయ, నివాస, పుట్టిన తేదీ పత్రాలను తహసీల్దార్​ కార్యాలయం ద్వారా పొందారు.

వారిద్దరికీ అప్పటికే వివాహాలు కావడంతో వారి భార్య పేరున నకిలీ పెళ్లి ఫొటోలు సృష్టించి ఆన్​లైన్​లో కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. వారికి అప్పటి తహసీల్దార్ తారసింగ్ మద్దతు ఇచ్చారు. దీనితో వారి దరఖాస్తులకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఇరువురికి లక్ష రూపాయల చొప్పున మంజూరు అయ్యాయి.

ఈ విషయంలో పలువురు, ప్రస్తుత తహసీల్దార్​కు ఫిర్యాదులు చేశారు. అక్రమాలపై ఆయన విచారణ జరపగా విషయం బయటపడింది. దీనితో పోలీసులను ఆశ్రయించడంతో వారిని అరెస్టు చేశారు. నిందితుడు దేవీసింగ్​ను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు నెహ్రూ పరారీలో ఉన్నాడు.

ఇవీ చూడండి:'ఆర్టీసీ మిలియన్​ మార్చ్​ను విజయవంతం చేయండి'

Last Updated : Nov 9, 2019, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details