కరోనా కష్టాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్తో కలిసి పర్యటించారు.
'లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ' - mla manik rao
కరోనా వంటి ఆపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యం నెరవేరుస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
జహీరాబాద్లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పలు గ్రామాల్లో 15 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న లాక్డౌన్కు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోరారు.