తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

దేశంలో ఎక్కడాలేని విధంగా  రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్​ అమలుచేస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో 225 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

పటాన్​చెరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

By

Published : Nov 25, 2019, 3:24 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రం వచ్చిన తొలి సంవత్సరం నుంచే సంక్షేమ పథకాలకు నాంది పలికారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో 225 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 23 లక్షల విలువగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ పథకాన్ని తొలుత రూ. 50,000తో ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారని తెలిపారు.

పటాన్​చెరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details