ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్.. మేనమామ కానుకగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 259 మంది లబ్ధిదారులకు రూ. 2.19 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
'కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ప్రజల సంక్షేమమే ముఖ్యం' - telangana news
కరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్య రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
న్యాల్కల్లో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
కొవిడ్ విపత్కర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:'కేసీఆర్ ఖాళీ పోస్టులు నింపు జర...చావులు కొంతమేరకైనా ఆపొచ్చు'