సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఇమామ్ నగర్ కూడలిలో అబ్కారీ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో పటాన్చెరు మండలం ఐనోలుకు చెందిన మహేష్, బండ్లగూడకు చెందిన బాలయ్యలు కల్లు సీసాలు అక్రమంగా తరలిస్తున్నారు. విషయం గమనించిన పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. కల్లును తరలిస్తున్న రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
లాక్డౌన్ సమయంలోనూ కల్లు తరలింపు.. ఇద్దరి అరెస్ట్ - సంగారెడ్డి లాక్డౌన్ సమయంలోనూ కల్లు తరలింపు
సంగారెడ్డి జిల్లా ఇమామ్ నగర్ కూడలిలో లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

లాక్డౌన్ సమయంలోనూ కల్లు తరలింపు.. ఇద్దరి అరెస్ట్