KA Paul complaint on Police: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పోలీసులపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండడానికి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులు లేకుండా చేశారని కేఏ పాల్ ఆరోపించారు. ధరణిని తీసుకువచ్చి తమ ఛారిటీ భూములను ఆగం చేశారని ఆరోపించారు. 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందని.. వారం రోజుల్లో మానవ హక్కుల కమిషన్.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు, సభ్యులను నియమించాలని కోరారు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న సదాశివపేట పోలీసులను సస్పెండ్ చేయాలని.. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినట్లు పాల్ స్పష్టం చేశారు. మీడియా ఎదురుగా జస్టిస్ చంద్ర కుమార్‌కు ఫోన్ చేసి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఉంటారా అని అడిగారు.
KA Paul Comments on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి ప్రగతి భవన్‌కి వెళితే.. తనని అడ్డుకున్నారని కేేఏ పాల్ పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి మీద తాను ప్రశ్నిస్తానని భయపడి కలిసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని తెలిపారు. తన మిత్రుడుకిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించుకున్నారని పేర్కొన్నారు. తాను ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నానని తెలిసి ప్రధాన ప్రతిపక్షం అంటున్నారని అన్నారు.