కొత్త వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో.. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు జాతా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు జాతా బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
ఇంత పెద్ద రైతు పోరాటం చూడలేదు : జూలకంటి - సంగారెడ్డిలో రైతు జాతా కార్యక్రమం
రైతులకు అండగా ఉండాల్సిన వారే ఆత్మహత్యలకు కారణమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

స్వాతంత్య్రం వచ్చాక ఇంత పెద్ద రైతు పోరాటం మనం చూడలేదని జూలకంటి అన్నారు. పెద్దఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నా.. మోదీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు వారి ఆత్మహత్యలకు కారణమతున్నాయని ఆరోపించారు. కొంత మంది.. వారి ఉద్యోగాలను విడిచిపెట్టి రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. మరణించిన సుమారు 40 మంది రైతులకు జోహార్లు అర్పిద్దామన్నారు. వెంటనే నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి:రెవెన్యూ అధికారుల తీరుతో రైతు ఆత్మహత్య