సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్ మండలాల్లో వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలను లబ్ధిదారులకు అందించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో లాటరీ పద్ధతిలో జిల్లా అదనపు పాలనాధికారి వీరారెడ్డి.. ఇళ్లను కేటాయించారు. లాటరీలో ఎంపికైన 325 మందికి రెండు రోజుల్లో ఇళ్లను అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయింపు.. రెండు రోజుల్లో అప్పగింత - SANGAREDDY NEWS
సంగారెడ్డి జిల్లా పరిధిలోని నిర్మించిన వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలను కేటాయించారు. అదనపు పాలనాధికారి వీరారెడ్డి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేశారు. రెండు రోజుల్లో గృహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయింపు.. రెండు రోజుల్లో అప్పగింత
మిగిలిన ఇళ్లను స్థానికులకు ఇవ్వాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఫలితంగా వాటి కేటాయింపులు ప్రస్తుతానికి నిలుపుదల చేసినట్లు అధికారులు తెలిపారు.