తెలంగాణ

telangana

ETV Bharat / state

రుక్మిణి థియేటర్​లో జాతిరత్నాలు బృందం సందడి - Sangareddy District Latest News

సంగారెడ్డి జిల్లా కేంద్రం రుక్మిణి థియేటర్​లో జాతిరత్నాలు సినిమా బృందం సభ్యులు సందడి చేశారు. దర్శకుడు అనుదీప్ జిల్లా వాసి కావడంతో చిత్రాన్ని చూడటానికి జనం భారీగా తరలి వస్తున్నారు. సినిమాను గొప్పగా ఆరాధిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

jathi Ratnalu Team in the Rukmini Theater
రుక్మిణి థియేటర్​లో జాతిరత్నాలు బృందం సందడి

By

Published : Mar 13, 2021, 4:48 PM IST

జాతిరత్నాలు సినిమా బృందం సభ్యులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రుక్మిణి థియేటర్​లో సందడి చేశారు. థియేటర్​లో ఈ చిత్రం రెండు రోజులుగా ప్రసారమవుతోంది. దర్శకుడు అనుదీప్ జిల్లా వాసి కావడంతో ప్రజలు సినిమా చూడటానికి భారీగా తరలి వస్తున్నారు.

సంగారెడ్డి, జోగిపేట పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ఎక్కువగా జరగడంతో జిల్లా ప్రజల్లో సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది. చిత్రాన్ని గొప్పగా ఆరాధిస్తున్నందుకు సినీ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. అనుదీప్, హీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, కథానాయిక ఫారియా అబ్దుల్లా, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బెంగళూరు డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: తనీష్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details