కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు, వర్తక వాణిజ్య వర్గాలు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమై... ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. ప్రధాన రహదారులు జనసందోహం లేకుండా నిర్మానుష్యంగా మారాయి. నర్సాపూర్‌లో కర్ఫ్యూ ప్రశాంతంగా కొనసాగుతుంది. దుబ్బాకలో ప్రధాన రహదారులు, బస్టాండ్ పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉమ్మడి మెదక్‌లో కర్ఫ్యూ.. స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జనతాకర్ఫ్యూ ప్రశాంత వాతావరణం నడుమ కొనసాగుతోంది. ప్రజలు వర్తక వాణిజ్య వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి మెదక్‌లో కర్ఫ్యూ.. స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు
సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కర్ణాటక సరిహద్దు జహీరాబాద్‌లో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే వారిపట్ల అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'