సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వాసులు సంపూర్ణంగా పాటిస్తున్నారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులోని జహీరాబాద్‌లో వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయడం వల్ల ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. ఆర్టీసీ డిపోల్లో సుమారు వంద బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో 5 బస్సులను అత్యవసరం కోసం సిద్ధంగా ఉంచినట్లు డీఎం రమేశ్ తెలిపారు.
జహీరాబాద్‌లో కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు
జహీరాబాద్‌లో ప్రజలు కర్ఫ్యూకు పూర్తి సహాకారం అందిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయడం వల్ల ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో 5 బస్సులను అత్యవసరం కోసం సిద్ధంగా ఉంచినట్లు డీఎం రమేశ్ పేర్కొన్నారు.
జహీరాబాద్‌లో కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే వాహనాలతో సందడిగా కనిపించే 65వ నెంబరు జాతీయ రహదారి వెలవెల బోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో రద్దీగా కనిపించే భవాని మందిర్ ట్రాఫిక్ కూడలి జన సంచారం లేక ఖాళీగా కనిపిస్తోంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు వాహనాల్లో గస్తీ నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు