తెలంగాణ

telangana

ETV Bharat / state

'కలిసికట్టుగా పోరాడదాం..' వైరలవుతోన్న రైతుబిడ్డ వీడియో సందేశం.. - కలిసికట్టుగా పోరాడదాం

జాతీయ పెట్టుబడులు ఉత్పత్తుల మండలి (నిమ్జ్‌) కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. అధికారులు ప్రకటించిన పరిహారం తమకు సరిపోదంటూ ఏడేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రంలో భూసేకరణ కోసం గ్రామాల్లోకి వెళ్తున్న అధికారులకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. జహీరాబాద్ నిమ్జ్ కోసం అధికారులు చేస్తున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ ఓ బాధిత రైతు కుమార్తె విడుదల చేసిన వీడియో సందేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Jaheerabad Nimz Victim Farmers Daughter video message viral
Jaheerabad Nimz Victim Farmers Daughter video message viral

By

Published : Jul 6, 2022, 8:53 PM IST

'కలిసికట్టుగా పోరాడదాం..' వైరలవుతోన్న రైతుబిడ్డ వీడియో సందేశం..

సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ.. జహీరాబాద్​ నిమ్జ్ రైతుల దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో చేసింది. ఒకటిన్నర నిమిషమున్న ఈ వీడియోలో బాధిత రైతుల ఆవేదనను కళ్లకు కట్టినట్టు చెప్పగా.. ఇప్పుడు ఈ వీడియో సర్వత్రా చర్చనీయంశంగా మారింది. జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలికి రైతులు తమ భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నా.. అధికారులు మాత్రం సిద్ధమని ప్రకటిస్తున్నారని అక్షయ ఈ వీడియోలో ఆరోపించింది. భూముల క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయడం, మూడు పంటలు పండే భూములు పంటలు పండవని చూపడం, కోటి రూపాయలు పలుకుతున్న స్థలానికి 5 లక్షలే వస్తున్నాయని మంత్రి కేటీఆర్​ చెప్పటం లాంటి అంశాలను ప్రస్తావిసూ.. ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు దఫాల్లో జరిగిన భూబాధితుల పోరాటాల్లో పాల్గొన్నామని.. భవిష్యత్తులోనూ అందరం కలిసి కట్టుగా పోరాడి భూములను కాపాడుకుందామని పిలుపునివ్వటం అందరిని ఆలోచింపజేస్తోంది.

"మంచివాడు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎవరూ వినరు. అదే చెడ్డవాడు ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మేస్తారు. నిమ్జ్​ రైతులపై జరుగుతున్న అన్యాయాలపై నాదొక విన్నపం. నేను కూడూ మీతో పాటు ఆరు.. ఏడేళ్లుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నా. భూములివ్వమని చెప్పినవాళ్ల రిజిస్ట్రేషన్లు ఆపేయటం.. పంటలు పండవని చెప్పడం.. ఒక్క ఎకరా విలువ కోటి రూపాయలున్నా మంత్రి కేటీఆర్​.. 5 లక్షలే ఉందని చెప్పటం.. ఇదంతా పెద్ద మోసం. పై నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు భూములు లాక్కోవాలనే చూస్తున్నారు. అందుకే ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. ఈ ఏడేళ్లు మనం ఎలాగైతే పోరాడుతున్నామో అలాగే.. కలిసికట్టుగా ఉద్యమిద్దాం. మిగతా రైతుల మద్దతు కూడా కూడగట్టుకుందాం. ప్రభుత్వానికి నాదొకటే విన్నపం.. పంటలు పండని భూములు ఎన్నో ఉన్నాయి. ఇండస్ట్రీలు అక్కడ పెట్టండి. మూతపడిన పరిశ్రమలు తెరిచి అందులో.. యువతకు ఉపాధి కల్పించండి. జై జవాన్​.. జై కిసాన్​.."- అక్షయ, రైతుబిడ్డ

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details