సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం అల్లిపూర్‌లో రూ.29 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో విలీనమైన అల్లిపూర్ గ్రామంలో సీసీ రోడ్లకు నిధులు కేటాయించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
సీసీరోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే - అల్లిపూర్‌లో సీసీరోడ్డు పనులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెచ్చిస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్‌లో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాణిక్‌రావు
ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని... మాస్క్ లేనిదే బయటకు రావొద్దని సూచించారు.
ఇదీ చూడండి:సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయి: చల్లా ధర్మారెడ్డి