మియాపూర్ నుంచి సంగారెడ్డి పట్టణానికి మెట్రోరైలు విస్తరించేలా ఎంపీలు పార్లమెంట్లో చర్చించాలని సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి... కాంగ్రెస్ ఎంపీలను కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా.. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలతో మెట్రో లైన్‌పై చర్చించారు.
సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : జగ్గారెడ్డి - jaggareddy latest news
మియాపూర్ నుంచి సంగారెడ్డి పట్టణానికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలని కాంగ్రెస్ ఎంపీలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు.
jaggareddy
సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు రోజుకు సుమారు 2 వేల మంది ప్రయాణిస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఈ మార్గం రద్దీగా ఉండటంతో మెట్రో రైలు అవసరమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి మంజూరు కోసం ప్రయత్నించాలని ఎంపీలను కోరారు.
ఇదీ చదవండి :పాడి పరిశ్రమపై చిన్నచూపు ఎందుకు..?: ఎంపీ కోమటిరెడ్డి