తెలంగాణ

telangana

ETV Bharat / state

JAGGAREDDY: 'రేవంత్​రెడ్డి సీనియర్ నేతలను దూరం పెట్టడం సరికాదు' - telangana latest news

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీరుపై ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్​ నేతలను సంప్రదించకుండానే కమిటీలు వేస్తున్నారని ఆరోపించిన ఆయన.. సీనియర్ నేతలను దూరం పెట్టడం సరికాదన్నారు.

JAGGAREDDY: 'రేవంత్​రెడ్డి సీనియర్ నేతలను దూరం పెట్టడం సరికాదు'
JAGGAREDDY: 'రేవంత్​రెడ్డి సీనియర్ నేతలను దూరం పెట్టడం సరికాదు'

By

Published : Sep 11, 2021, 8:57 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీరుపై సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్​ నేతలను సంప్రదించకుండా కమిటీలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల నియమించిన అధికార ప్రతినిధుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. సమావేశాలకి సీనియర్లను పిలవాలని రేవంత్​కు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకూ ఆ లేఖపై రేవంత్​రెడ్డి స్పందించలేదన్నారు.

ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో హుజూరాబాద్‌లో సభ చాలా అవసరమని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో గెలవాలని అనుకోవటం లేదా అంటూ ప్రశ్నించారు. దిల్లీ పర్యటనకు ఎంపీ, ఎమ్మెల్యేలను పిలవలేదన్న జగ్గారెడ్డి.. సీనియర్ నేతలను దూరం పెట్టడం సరికాదన్నారు.

ఇదీ చూడండి: అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details