తెలంగాణ

telangana

ETV Bharat / state

నగర ప్రజలు వంద సీట్లు ఇస్తే... గాలికొదిలేస్తారా! - trs

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు వందసీట్లు నగర ప్రజలు ఇస్తే... ఇచ్చిన హామీలను కారు పార్టీ గాలికొదిలేసిందని మండిపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా​రెడ్డి. గాంధీభవన్​లో ఆయన ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

By

Published : Jun 25, 2019, 5:03 PM IST

హైదరాబాద్‌లో ట్రాఫిక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతోందని... గంటల కొద్ది ట్రాఫిక్​లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందసీట్లు తెరాసకు నగర ప్రజలు ఇస్తే... ఇచ్చిన హామీలను కారు పార్టీ గాలికొదిలేసిందని మండిపడ్డారు. ట్రాఫిక్ సమస్యపై సీఎం సమీక్ష నిర్వహించి.. పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. తాము ప్రతిపక్షంగా సలహా మాత్రమే ఇవ్వగలుతామని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. నగర ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో తీసుకొచ్చామని గుర్తుచేశారు.

గాంధీభవన్​లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details