కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియాలకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి చెందిన కొందరు అనుచరులు సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాన్ని కోర్ కమిటీలో చర్చించాలని కోరారు.
రేవంత్ రెడ్డి అనుచరుల అరాచకాలు ఎక్కువయ్యాయి: జగ్గారెడ్డి - రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా
రాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం వెటంనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పెద్దను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.
రేవంత్ రెడ్డి అనుచరుల అరాచకాలు ఎక్కువయ్యాయి
111 జీవోను పీసీసీ అద్యక్ష పదవికి లింక్ పెట్టి... చేస్తున్న ప్రచారంపై సమావేశంలో చర్చించాలని తెలిపారు. భవిష్యతులో రాష్ట్రంలోని ఏ సమస్యనైనా కోర్ కమిటీలో చర్చించిన తర్వాతే... ముందుకెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా దగ్గర ఉన్న కొందరు ప్రోటోకాల్ ఇంఛార్జీలను తక్షణమే మార్చాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:ఎనిమిదేళ్ల క్రితం నోటీసులు ఇచ్చి ఇప్పటికీ చర్యలు తీసుకోరా?