సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎంఐజీ ఫేస్-2 విద్యుత్నగర్లో భారీ చోరీ జరిగింది. షేక్ అబ్దుల్ రావుఫ్ ఈనెల 19న కుటుంబంతో సహా అనంతపూర్లో ఓ వివాహ వేడుకకు వెళ్లారు. అది ముగించుకుని శనివారం ఇంటికొచ్చేసరికి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు! - When there is no one in the house, unidentified thugs break the locks
ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. నాలుగు తులాల బంగారం, హోమ్ థియేటర్, ఎల్సీడీ టీవీ, ఇంటి ముందున్న కారు దొంగిలించుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారీ చోరీ
లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, హోమ్ థియేటర్, ఎల్సీడీ టీవీ, ఇంటిముందున్న కారు దొంగిలించుకుని వెళ్లిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'జబర్ధస్త్' ఛాలెంజ్... మొక్కలు నాటిన శ్రీను, రామ్ ప్రసాద్