కోవిడ్ బాధితుల కోసం కల్వరి టెంపుల్ చర్చిని ఐసోలేషన్ కేంద్రంగా మార్చడం అభినందనీయమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులోని కల్వరి టెంపుల్ చర్చిలో ఏర్పాటు చేసిన 100 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఐసోలేషన్ కేంద్రంగా జహీరాబాద్ కల్వరి టెంపుల్ చర్చి - కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ కేంద్రం
కల్వరి టెంపుల్ చర్చిలో ఏర్పాటు చేయనున్న ఐసోలేషన్ కేంద్రాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పరిశీలించారు. కరోనా రోగుల కోసం చర్చిని ఐసోలేషన్ కేంద్రంగా మార్చటంపై అభినందనలు తెలిపారు.

ఐసోలేషన్ కేంద్రంగా జహీరాబాద్ కల్వరి టెంపుల్ చర్చి
వారం రోజుల్లోపు జహీరాబాద్ ప్రాంతంలోని కోవిడ్ బాధితుల కోసం అత్యాధునిక ఐసోలేషన్ కేంద్రం అందుబాటులోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు. మంచాల ఏర్పాటు ఇతర సౌకర్యాలను మాణిక్రావు పరిశీలించారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం