సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు.
సంగారెడ్డిలో ప్రశాంతంగా మొదలైన ఇంటర్ పరీక్షలు - INTERMEDIATE EXAMS 2020
ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా నేడు మొదటి సంవత్సర విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా... అన్ని ఏర్పాట్లు చేశారు.
INTERMEDIATE FIRST YEAR EXAMS STARTED IN SANGAREDDY
జిల్లాలో మొత్తం 49 పరీక్ష కేంద్రాలలో 16076 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యార్థులు నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.