తెలంగాణ

telangana

ETV Bharat / state

మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం - intermediate student commited suicide due to caught during mass copy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. మనస్థాపానికి గురైన ఆబేద్ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాపీ కోడుతూ పట్టుబడ్డాడని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కాపీ కోడుతూ పట్టుబడ్డాడని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Mar 16, 2020, 5:42 PM IST

ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో చోటు చేసుకుంది. జహీరాబాద్​లోని గడిమొహల్లకు చెందిన సయ్యద్ అబేద్ అలీ పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం పరీక్ష రాస్తూ కాపీయింగ్​కు పాల్పడి పట్టుబడినట్లు సమాచారం. మనస్థాపానికి గురైన విద్యార్థి ఆబేద్ ఇంటి పెంట్ హౌస్ గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబీకులు గుర్తించి హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాపీ కోడుతూ పట్టుబడ్డాడని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఇవీ చూడండి : స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి.. అనంతలోకాలకు

ABOUT THE AUTHOR

...view details