తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణం తీసిన ఈత సరదా - సంగారెడ్డి జిల్లా వార్తలు

స్నేహితులతో చెరువులో ఈతకు దిగిన యువకుడు ఈతరాక మునిగిపోయి.. ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటు చేసుకుంది.

Inter Student Falls In Lake And Loss His Lives
ప్రాణం తీసిన ఈత సరదా

By

Published : May 23, 2020, 10:29 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు అనిల్​ (16) ఇంటర్​ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అరుణ్​, శంకర్​ రెడ్డి, జానకిరామిరెడ్డిలతో కలిసి అనిల్​ గ్రామ శివారులోని గిద్ద చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో తక్కువ లోతు ఉన్న ప్రాంతంలో దిగి ఆడుకున్నారు.

ప్రమాదవశాత్తు అనిల్​ లోతుగా ఉన్న వైపు వెళ్లడం వల్ల నీటిలో మునిగిపోయాడు. మిగతా ముగ్గురు స్నేహితులకు కూడా ఈత రాకపోవడం వల్ల అనిల్​ మునిగిపోతుంటే కాపాడలేకపోయారు. స్థానికులకు తెలిసే సరికి ఆలస్యం కావడం వల్ల అప్పటికే నీళ్లు మింగిన అనిల్​ ప్రాణాలు విడిచాడు. తండ్రి ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details