తెలంగాణ

telangana

ETV Bharat / state

తోక లేని పిట్ట ఎగిరి ఎగిరి బట్వాడా ఇంట్లోనే...! - inspection at bpm danniel house

Inspection by District Officer of Postal Department in Sangareddy : ఒకప్పుడు సమాచారం అంతా ఉత్తరాల ద్వారానే పంపిణీ అయ్యేది. ప్రస్తుతం కూడా కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పనులకు ఉత్తరాలను ఉపయోగించుకోంటున్నారు. బీపీఎం ఉత్తరాలను వ్యక్తులకు ఇవ్వకుండా తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇదంతా సంగారెడ్డి జిల్లాలో తపాలా శాఖ అధికారుల తనిఖీలో బయటపడింది.

Inspection by District Officer of Postal Department
తపాలాశాఖ జిల్లా అధికారి తనిఖీ

By

Published : Dec 14, 2022, 9:59 AM IST

Inspection by District Officer of Postal Department in Sangareddy: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం వాసర్‌ గ్రామంలోని పోస్టాఫీసును తపాలాశాఖ జిల్లా అధికారి(డిస్ట్రిక్ట్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌) ఎస్‌వీఎల్‌ఎన్‌ రావు మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయంలో దస్త్రాలు లభించకపోవడంతో అనుమానంతో నారాయణఖేడ్‌లో బీపీఎం డానియల్‌ ఇంటికి వెళ్లి పరిశీలించారు. మూడు బస్తాల్లో రెండేళ్లుగా బట్వాడా(డెలివరీ) చేయని ఉత్తరాలు లభ్యమయ్యాయి.

వీటిలో 1,000 వరకు సాధారణ, 300 రిజిస్టర్‌ ఉత్తరాలు, ఆధార్‌ కార్డులు ఉన్నాయి. వాసర్‌ పోస్టాఫీసులో ఉండాల్సిన ఉత్తరాలు ఇంట్లో ఎందుకు ఉన్నాయని బీపీఎంపై అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాల బట్వాడా విషయంలో రెండు నెలల కిందట డానియల్‌ను హెచ్చరించినా ఆయన ధోరణిలో మార్పు రాలేదని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని.. బీపీఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉత్తరాలను ప్రజలకు బట్వాడా చేస్తామన్నారు. తనిఖీల్లో పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, తపాలా సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details