తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలను బడికి పంపించాలని.. ప్రధానోపాధ్యాయుడి వినూత్న నిరసన

సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్న నిరసన చేపట్టారు. పాఠశాలకు విద్యార్థులు రావడం లేదని... వారి ఇళ్ల ఎదుట పడుకొని నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు.. అప్పటికప్పుడు తమ పిల్లలను పాఠశాలకు పంపారు.

Innovative protest by the headmaster in Pulkal
పిల్లలు బడికి రాలేదని... ప్రధానోపాధ్యాయుడి వినూత్న నిరసన

By

Published : Jun 16, 2022, 7:35 AM IST

విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం ముదిమానిక్యం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఆసక్తికర సన్నివేశం గ్రామస్థులనూ ఆలోచింపజేసింది.

గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వివిధ తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి హాజరవడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు బుధవారం ఆ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వారి ఇళ్ల ఎదుట పడుకొని నిరసన తెలుపుతూ.. విద్యార్థులను బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. దీనిపై స్పందించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు.. అప్పటికప్పుడు తమ పిల్లలను పాఠశాలకు పంపారు. మిగిలిన విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చే వరకు ఇలాగే చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఇదీచదవండి:

ABOUT THE AUTHOR

...view details