తెలంగాణ

telangana

ETV Bharat / state

లైవ్​ వీడియో: ఏటీఎంనే ఎత్తుకెళ్లారు! - updated news on atm theft in patancheru

ఇంతకాలం ఏటీఎం పగులగొట్టి నగదు దొంగిలించిన దొంగలను చూశాం.. కానీ ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

indicash atm theft in patancheru in sangareddy district
ఏటీఎంలో డబ్బులు కాదు.. ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

By

Published : Feb 23, 2020, 5:32 PM IST

ఏటీఎంలో డబ్బులు కాదు.. ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో ఓ ఇండిక్యాష్​ ఏటీఎం యంత్రాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామ పరిధిలో ఓ షెటర్​ను అద్దెకు తీసుకుని రెండు ఇండిక్యాష్ ఏటీఎం యంత్రాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు షెటర్​లోకి దూరి.. ఓ ఏటీఎంను ఎత్తుకెళ్లారు.

నగదు తీసుకుందామని వెళ్లిన వినియోగదారులకు ఒక ఏటీఎం మాత్రమే కనిపించడం వల్ల స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సీసీ టీవీ పుటేజీలో వారు దొంగిలించిన తీరును బట్టి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తాం...'

ABOUT THE AUTHOR

...view details