F2F: బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగేందుకు కారణమిదే! - కొవిడ్ సోకిన మధుమేహ బాధితుల్లో 80శాతం మందికి బ్లాక్ ఫంగస్
భారత్ భౌగోళిక పరిస్థితులు కూడా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగేందుకు కారణమని ఇండియానా స్టేట్ కమ్యూనిటీ హౌవర్ట్ ఆసుపత్రి డా.కార్తీక్‌రావు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన మధుమేహ బాధితుల్లో 80శాతం మందికి బ్లాక్ ఫంగస్ సోకుతుందని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం ఆయన మాటల్లోనే విందాం.
బ్లాక్‌ఫంగస్ కేసులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే నమోదవుతున్నాయని అవుతున్నాయని అమెరికాలోని ఇండియానా స్టేట్ కమ్యూనిటి హౌవర్ట్ ఆసుపత్రి డాక్టర్స్ డైరెక్టర్ కార్తీక్‌రావు తెలిపారు. భౌగోళిక పరిస్థితులు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మూడో వేవ్ కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధం అవుతోందని.. ఇప్పటికే 12ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారని.. త్వరలో నాలుగేళ్ల పైబడిన పిల్లలకు వేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినే ఎకైక అస్త్రం అంటున్న కార్తీక్‌రావుతో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.