తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డిలో ఇందిరా గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన హస్తం నేతలు - India Gandhi death anniversary in sangareddy

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి ఎనలేని సేవలు చేశారని సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి కొనియాడారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

India Gandhi death anniversary in sangareddy
సంగారెడ్డిలో ఇందిరా గాంధీ వర్ధంతి

By

Published : Oct 31, 2020, 2:04 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి అన్నారు.

తమ పార్టీ ఎల్లప్పుడు పేదవాళ్లకు అండగా నిలుస్తుందని తెలిపారు. దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details