తెలంగాణ

telangana

ETV Bharat / state

కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులకు అస్వస్థత - Students get sick

food poisoning
food poisoning

By

Published : Nov 5, 2022, 11:44 AM IST

Updated : Nov 5, 2022, 12:30 PM IST

11:28 November 05

కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

Food Poison in Narayankhed KGBV: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 40 మంది వరకు బాలికలు అనారోగ్యానికి గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఈరోజు ఉదయం అల్పాహారంగా ఇచ్చిన అటుకుల్లో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాలికలను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి తమ పిల్లల ఆరోగ్యంపై వైద్యులను ఆరా తీశారు.

Last Updated : Nov 5, 2022, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details