Muthangi gurukul school : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపిన విషయం తెల్సిందే. అదే పాఠశాలకు చెందిన మరో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం, సోమవారం నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన 25 మంది బాలికలు వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు.
Patancheru Gurukul school : కొవిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా.. 25 మంది బాలికలకు అస్వస్థత - తెలంగాణ వార్తలు
![Patancheru Gurukul school : కొవిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా.. 25 మంది బాలికలకు అస్వస్థత Patancheru Gurukul school, corona news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13774454-658-13774454-1638253251213.jpg)
11:37 November 30
కొవిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా.. 25 మంది బాలికలకు అస్వస్థత
Muthangi gurukul school : పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం 42 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ఒక విద్యార్థికి స్వల్ప లక్షణాలు ఉండటంతో అనుమానంతో పాఠశాలలో వైద్య పరీక్షలు చేపట్టారు. గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 27మంది సిబ్బంది, 491మంది విద్యార్థులు ఉండగా.. ఆదివారం 27 మంది సిబ్బంది, 261మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక ఉపాధ్యాయురాలికి, 42మంది విద్యార్థులకు కరోనా సోకినట్లుగా తేలింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రి దేవి ఆధ్వర్యంలో మిగిలిన వారికి సోమవారం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి నిన్న పరీక్షలు పూర్తయ్యాయి. మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. పాఠశాలలోని మొత్తం 48 మంది బాధితుల్లో ఒక టీచర్, 47 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు
corona cases in gurukul school: ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి:Sabitha review on corona: 'కొన్నిచోట్ల స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోంది'